Minister Harish Rao: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం కేసీఆర్ టెట్ ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 2015లోనూ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో నిర్వహించిన టెట్ పరీక్షలో వెయ్యి మందికి 800మంది అర్హత సాధించారు. మీరు ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిబిరానికి సార్ధకత ఉంటుందన్నారు. ఉచిత శిక్షణ శిబిరంలో ఏదీ ఉచితంగా రాలేదు కాబట్టి కష్టపడి చదవాలని సూచించారు. ఉద్యోగ నియామకాల్లో 95శాతం స్థానికులకే అవకాశం దక్కేలా.. అన్ని జిల్లాల్లో సమానంగా ఖాళీలు ఉండేలా చొరవ చూపామని పేర్కొన్నారు.
'ఉద్యోగ పరీక్షలు అయ్యే వరకు మొబైల్‌ను దూరం పెట్టండి. ఈ రెండు నెలలు దించిన తల ఎత్తకుండా చదవాలి. అప్పుడే మీ జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారు. ఉద్యోగాలలో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని మెరిట్‌కే పట్టం కట్టాలని సీఎం ఆలోచన చేశారు. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం. ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లితే ఏదైనా సాధ్యమవుతుంది.' - హరీశ్ రావు, మంత్రి
ఇదీ చదవండి: 'ఇది కేవలం అన్నదాతల పోరాటమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం..'