రాష్ట్రంలో ఇక నుంచి ఏ కాలంలో నైనా కాళేశ్వరం నీటితో ఏడాదిలో రెండు పంటలు పండుతాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దిలాల్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని, ఫంక్షన్‌హాల్‌ని హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజల శుభకార్యాలకి ఈ ఫంక్షన్‌హాల్ ఉపయోగపడుతుందని మంత్రి వెల్లడించారు.
ఒక్క దిలాల్పూర్ గ్రామాన్నే ఆరేళ్లలో రూ. 17 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. గ్రామస్థులు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరారని, అన్నింటికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: 'మేం వైదొలుగుతున్నాం... భాజపా విజయం కోసం పనిచేస్తాం'