సిద్దిపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మొక్కలను నాటిన మంత్రి... సీపీ జోయల్ డేవిస్‌తో కలిసి సీసీటీవి కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. రూ. 2 కోట్ల 14 లక్షలతో సిద్దిపేట పట్టణంలో 550 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీల్లో, కాలనీల్లో, సొంత ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సేఫ్ సిద్దిపేటగా మార్చడానికి ప్రజలు సహకరించాలని కోరారు.
గతంలో జరిగిన నేరాలను సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా ఛేదించారనే వీడియో ఫుటేజీలను పోలీస్ కమిషనర్‌తో కలిసి హరీశ్ రావు వీక్షించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: కరోనా, సాధారణ జలుబు మధ్య తేడా ఇదే...