ETV Bharat / state

దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్​ రావు - సిద్ధిపేట జిల్లా తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లిలో మంత్రి హరీశ్​ రావు సమక్షంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. కాంగ్రెస్​, భాజపా నాయకులపై హరీశ్​ విమర్శలు చేశారు. ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఎలక్షన్లు అయిపోయేదాకా ఉండి తరవాత ప్రజలను పట్టించుకోరని ఎద్దేవా చేశారు.

minister-harish-rao-in-siddipet-district-regarding-new-joinings-in-trs-party
దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్​ రావు
author img

By

Published : Oct 9, 2020, 12:04 PM IST

Updated : Oct 9, 2020, 12:40 PM IST

తెరాస పార్టీలో చేరికలు ఎప్పుడైనా ప్రజల ముందు, గ్రామాల్లో జరుగుతాయనీ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. దుబ్బాక ఉద్యమాల గడ్డ అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల వరకు ఇక్కడే ఉండి, అయిపోయాక వెళ్లిపోతారని విమర్శించారు. ఓట్ల కోసం వచ్చే నాయకుడు కావాలా.. అభివృద్ధి చేసే నాయకుడు కావాలా మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లిలో మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సమక్షంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలోని ఏ మండలానికైనా ఉత్తమ్ వచ్చి​ ఎవరినీ పలకరించలేదని, కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అది ప్రజలు తెలుసుకోవాలన్నారు.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల కిందట వచ్చి టికెట్ కావాలని అడిగారని... కాంగ్రెస్​లో చేరితే తన తండ్రి ఆత్మ క్షోభిస్తుందని మీడియా ముందు చెప్పారని హరీశ్​ అన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్​లో చేరారని... తండ్రికి న్యాయం చేయని ఆయన ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పేర్కొన్నారు. దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు లేరని చెప్పి.. టికెట్ ఇవ్వకపోతే పార్టీని మారుతారా అని ప్రశ్నించారు.

నాలుగు సార్లు ముత్యంరెడ్డిని గెలిపిస్తే ఇంటింటికీ నీళ్లు ఇవ్వలేదు.. కానీ రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటికీ తాగునీరు, రైతులకు సాగునీరు అందించారని తెలిపారు. రాయపోల్ మండలం అయ్యిందంటే రామలింగారెడ్డి, కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. రామలింగారెడ్డి చనిపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి సుజాతని గెలిపించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.

'కొత్త రెవెన్యూ చట్టం ద్వారా లంచాలు లేకుండా త్వరితగతిన రైతులకు సేవలందిస్తాం. కానీ భాజపా తెచ్చిన చట్టం ద్వారా గ్రామాల్లో సబ్సిడీ ఉండక పోగా కరెంట్ బిల్లు కట్టాలి. ఎస్సీలకు 101 యూనిట్ల ఉచిత కరెంట్ ఉండదు. కాంగ్రెస్​, భాజపా నాయకులు ఎలక్షన్లు అయిపోయే దాకా ఉండి వెళ్లిపోతారు. కానీ మేము ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాం.'

- హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చదవండి: అంతరాలయం ప్రవేశం లేదు... కానీ అభిషేకానికి అడ్డంకి లేదు..

Last Updated : Oct 9, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.