ETV Bharat / state

Harish rao On BJP: కోత పెట్టిన పనిదినాలపై కేంద్రాన్ని నిలదీయండి: హరీశ్ రావు - కిషన్ రెడ్డికి సవాల్

Harish rao On BJP: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలకు సాయం చేస్తుంటే.. కేంద్రం మాత్రం ఎరువులు, ఇంధన ధరలు పెంచుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కార్మిక చట్టాలు రద్దు చేసి వారిపై ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

Harish rao On BJP
మంత్రి హరీశ్ రావు
author img

By

Published : Mar 31, 2022, 6:11 PM IST

Harish rao On BJP: ఉపాధిహామీ పనిదినాల్లో కోత పెట్టి కూలీలను కూడా భాజపా ప్రభుత్వం మోసం చేసిందని రాష్ట్రమంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 16 కోట్ల పనిదినాలు కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్రాన్ని కిషన్ రెడ్డి నిలదీయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఈజీఎస్, సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన పాడి పశువుల వసతి సముదాయం, పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఎనిమిది రోజులుగా పెట్రోల్, ఎరువులు, వంటగ్యాస్ ధరలు పెంచిన కేంద్రం పేద ప్రజల ఉసురు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 16 లక్షల ఖాళీలు ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నిండా ముంచిందన్నారు. భాజపా నేతలు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంతో కేసీఆర్ రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తే.. కేంద్రం మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు.

కేంద్రం అందరీ ఉసురు పోసుకుంటున్నది. ఎనిమిది రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెంచిర్రు. ఇవాళ పేదవాళ్లను పీల్చి పిప్పి చేస్తున్నరు. కేసీఆర్ రైతులకు సాయం చేస్తుంటే.. కేంద్రం మాత్రం మీటర్లు పెడతాం, ఎరువుల ధరలు పెంచుతామంటది. భాజపా చేసింది శూన్యం. కేసీఆర్ కాళేశ్వరం పూర్తి చేసి రైతుల కాళ్లు కడిగిండు. 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వరు. ఈ ఏడాది ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టిర్రు. 16 కోట్ల పనిదినాలు ఇవ్వమంటే 13 కోట్లే ఇచ్చిండ్రు. ఇక ఏ మొహం పెట్టుకుని కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాట్లాడుతున్నరు. వెంటనే 16 కోట్ల పనిదినాలు కల్పించాలని కిషన్ రెడ్డిని కోరుతున్నా. అన్ని రంగాలను నిర్వీర్వం చేస్తూ కేంద్రం పాలన సాగిస్తోంది.

- హరీశ్ రావు, మంత్రి

కోత పెట్టిన పనిదినాలపై కేంద్రాన్ని నిలదీయండి: హరీశ్ రావు

ఇదీ చూడండి:

Harishrao On MGM Incident: ఎంజీఎం ఘటనపై మంత్రి హరీశ్‌రావు సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.