కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంజాన్ తోఫా ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింల కోసం ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల కిట్స్, రూ. 500 నగదును మంత్రి పంపిణీ చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, రూ.1500 ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న ముస్లింలంతా దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
సిద్దిపేట కరోనా రహిత జిల్లాగా మారిందని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని.. బయట తిరిగి ఇంట్లో వాళ్లకు కరోనాను అంటించొద్దని సూచించారు. మరికొన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!