ఆపదలో ఉన్న వారికి అండగా ఉండడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని కొనియాడారు. సిద్ధిపేట జిల్లాలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 144 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగితో ఉండే బంధువులకు ఉచితంగా భోజనం పెడుతున్నామని చెప్పారు. డయాగ్నోస్టిక్, సిటీ స్కాన్ కేంద్రాలు, ఒక్క పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ యూనిట్ కేంద్రం, స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేటు దవాఖానాకు పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.
ఇదీ చదవండి: Biological-E: రూ.500లకే రెండు డోసుల టీకా!