సిద్దిపేట పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే వారిని గుర్తించి జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రజలు చెత్త వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సూచించారు.