సిద్దిపేట క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహంగా సాగుతోంది. గత పది రోజులుగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మొత్తం 60 జట్లు తలపడగా ఏసీసీ యూత్, ఇండియన్ టీం-05 జట్లు ఫైనల్‌కు చేరాయి. దీంతో ఈ జట్లకు బుధవారం డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు.
మరోవైపు ఈ మ్యాచ్ తిలకించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ సిద్దిపేట వచ్చారు. ఇన్నింగ్స్ విరామం సమయంలో మంత్రి హరీశ్, మాజీ క్రికెటర్ అజహరుద్దిన్ కాసేపు క్రికెట్ ఆడారు. అజహర్ బౌలింగ్ చేయగా.. హరీశ్ బ్యాటింగ్‌తో అలరించారు. పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలిరావడంతో సిద్దిపేట క్రీడామైదానంలో సందడి నెలకొంది.
ఇదీ చూడండి: 'రామోజీ ఫిల్మ్ సిటీ' పర్యటకం మళ్లీ షురూ