ETV Bharat / state

'మల్లన్నసాగర్​ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు'

సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు అధ్యక్షతన కౌన్సిల్​ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. సిద్దిపేటకు మంచినీళ్లు తెచ్చుకుంటే మున్సిపాలిటీ ఖర్చు తగ్గుతుందని మంత్రి తెలిపారు.

author img

By

Published : May 13, 2020, 2:52 PM IST

minister harish rao attended to municipal council meeting
'మల్లన్నసాగర్​ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు'

సిద్దిపేట మున్సిపాలిటీకి తాగునీటి కోసం నాబార్డు ద్వారా రూ. 380 కోట్లు మంజూరు చేయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. మల్లన్నసాగర్ పూర్తయితే సిద్దిపేటకు తాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలో నల్లా కనెక్షన్లు లేని ఇళ్లు ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

మిగులు బడ్జెటుతో బ్యాంకులో డబ్బులు ఫిక్స్​డ్ డిపాజిట్ చేసే విధంగా మున్సిపాలిటీ ఎదగాలని సూచించారు. పట్టణంలో మొదటి దశలో మిగిలి పోయిన యూజీడీ కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. యూజీడీ కనెక్షన్లు పొందేందుకు ప్రజలకు భారం లేకుండా చేశామని, ఈ విషయంలో స్థానిక కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.