రోడ్డుపై చెత్త వేస్తున్న వారిపై సిద్దిపేట పురపాలక సంఘం అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిఘా పెట్టి మరి అటువంటి వారిని గుర్తించి.. చర్యలు తీసుకుంటున్నారు. రోజూ ఇంటింటికి చెత్త సేకరణ బండి వెళ్తున్నా.. రోడ్లపై చెత్త కనిపింస్తుండటం వల్ల మంత్రి హరీశ్‌రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో రోడ్లపై చెత్తవేసే వారిని గుర్తించేందుకు బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి సమయంలో కూడా కాలనీల్లో నిఘా పెట్టారు.
ఇందులో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సతీశ్ సోమవారం రాత్రి పట్టణంలోని పలు వీధులను పరిశీలిస్తున్న క్రమంలో.. శ్రీనివాస థియేటర్ పక్కన ఓ ఇంటి యజమాని రోడ్టుపై చెత్త వేయడాన్ని గమనించారు. ఆ ఇంటి యజమానిని బయటకు పిలిపించి రోడ్డుపై వేసిన చెత్తను తీపించి .. అతని ఇంట్లోనే వేయించారు. ఇలా పలువురు వేసిన చెత్తను వారితోనే తీయించి వారిపై చర్యలు తీసుకున్నందుకు మంత్రి హరీశ్‌రావు సతీశ్‌ను అభినందించారు. ప్రజల ఆరోగ్యం కోసమే చెత్తను రోడ్డుపై వేయద్దని చెబుతున్నాం అని అన్న మంత్రి.. ఇదే స్ఫూర్తితో చెత్తను రోడ్డుపై వేయకుండా అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక