ETV Bharat / state

దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీశ్​ రావు

ప్రాజెక్టుల నిర్మాణాలు అంటే దశాబ్దాలు కాదు..మూడేళ్లలో పూర్తి చేయొచ్చని రంగనాయకసాగర్​ జలాశయం నిర్మించి చూపించామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు కలిగిన దాని కంటే ఎక్కువ ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

minister harish rao about ranganayaka sagar project
దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Apr 24, 2020, 2:34 PM IST

సిద్దిపేట రంగనాయకసాగర్​ జలాశయంలోకి మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు గోదావరి జలాలు విడుదల చేశారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు రావాలనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మార్గనిర్దేశం చేసిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు.

"ప్రాజెక్టుల నిర్మాణాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. ఒక్క ఇల్లు కూడా మునగకుండా రంగనాయకసాగర్​ జలాశయం నిర్మాణం జరిగింది. 170 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు నీళ్లు వచ్చేలా నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు కింద 400 చెరువులు, చెక్​డ్యామ్​లు నింపే అవకాశం దొరికింది. 1.5 టీఎంసీలు రాగానే కుడి, ఎడమ కాలువలకు నీళ్లు ఇస్తాం. కాలువపై వ్యవసాయం చేసే అదృష్టం సిద్దిపేట జిల్లా రైతులకు వచ్చింది. ఈ జలాలు రైతుల బతుకుదెరువు, జీవన స్వరూపాన్ని మారుస్తాయి."

- మంత్రి హరీశ్ రావు

ఈ అద్భుత ఘట్టాన్ని లక్షలాది సభ్యుల మధ్య జరుపుకోవాలి అన్నుకున్నాం కానీ... కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. రైతులకు నీరు అందించాలనే ఆశయంతో కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ప్రారంభించామని వెల్లడించారు.

దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీశ్​ రావు

ఇవీ చూడండి: మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.