మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల మహాసభ... సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసం ఉందని, తెరాస అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మేక రవి అన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమ సమస్యల పరిష్కారించాలని కోరారు.
హరితహారం, స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లది కీలక పాత్ర అని... సస్పెండ్ చేసినా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ కోపం కొంతనే.. కానీ మా పై ప్రేమ కొండంత ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా సంఘీభావం ప్రకటించిన ఉపాది హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను... మంత్రి హరీశ్ రావు సీఎం దృష్టికి తీసుకుపోయి, దసరా కానుకగా విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్, భాజపాకు ఓటు వేస్తే అంతే: హరీశ్ రావు