సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ ఆధ్వర్యంలో 134వ ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పట్టణంలో జెండాను ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ కార్మికుల రోజని సీఐటీయూ జిల్లా నాయకులు రేవంత్ తెలిపారు.
ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మే డేకు ఇంతటి కష్ట కాలం ఎప్పుడూ ఎదురుకాలేదని... కరోనా నిర్మూలనలో కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని విమర్శించారు.
ఇవీ చూడండి: