రానున్న మహాశివరాత్రి సందర్భంగా అమర్నాథ్ మంచు లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన కార్యక్రమ పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు భూమి సిద్దిపేట పట్టణంలో పూజ చేశారు. డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట చేసిన ఈ కార్యక్రమానికి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రి శ్రీకారం చుట్టారు.
అమర్నాథ్ యాత్ర తలపించేలా..
సిద్దిపేటలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. అమర్నాథ్ యాత్ర స్మురించేలా భారీ సెట్టింగులతో హిమాలయాలు, అమర్నాథ్ గుహ, మంచు లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పంచగంగల అభిషేకం
భక్తులందరిచే స్వామి వారికి పంచ గంగల అభిషేకం, బిల్వార్చన చేయించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ పీఠాధిపతుల వేద పండితుల ప్రవచనాలతో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి : దేవతల ఆగమనం... అట్టహాసంగా మహాజాతర ప్రారంభం