సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
పల్లె ప్రగతిలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, హరితహారం మొక్కలను నాటుతూ ట్రీ గార్డులు అమర్చాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ నిర్మించేందుకు సర్పంచులు కృషి చేయాలన్నారు.
- ఇవీ చూడండి: నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ