సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తోగుటకు చెందిన బకోళ్ల మధుసూదన్ రెడ్డి(21) మంగళవారం సాయంత్రం తీవ్ర మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధుసూదన్ రెడ్డి బుధవారం మృతి చెందాడు.
అయితే గ్రామపంచాయతీకి చెందిన దుకాణ సముదాయంలో తాను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని కిరాయికి ఇప్పించాలని సదరు గ్రామ సర్పంచ్ కొండల్ రెడ్డిని మధుసూదన్ రెడ్డి కోరగా సర్పంచ్ అంగీకరించకపోవడం వల్ల మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మృతుడి తండ్రి మల్లారెడ్డి తన కుమారుడి మరణానికి సర్పంచ్ కొండల్ రెడ్డి కారణమని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్