సిద్దిపేట జిల్లా లక్ష్మాపూర్ ఊరితో అనుబంధాన్ని ఒకరికొకరు చెబుతూ ఇడిసి పెట్టలేకున్నామని ఏడుస్తూ.. ఊరడించుకుంటూ ముందుకు సాగిపోయారు. ప్రభుత్వం వారికి ఆర్‌అండ్ ఆర్ పథకం వర్తింప చేసింది. గ్రామంలోని 384 కుటుంబాలను గజ్వేల్ మండలం సంగాపూర్‌లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరిచి తరలించడం వల్ల అందరూ బోరున విలపించారు.
ప్యాకేజీ అందరికీ రాలే...
గ్రామంలో భూసేకరణ చేసే ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని భూమయ్య అనే రైతు ఆరోపించారు. భూములకు, ఇళ్లకు, ఒంటరి మహిళలకు, 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇంకా రాలేదన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు... ఆందోళనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత పునరావాసాలు లేవు... తాత్కాలిక ఆవాసాలకు తరలించారని తెలిపారు.
న్యాయం చేస్తాం...
మల్లన్న సాగర్ కట్ట నిర్మాణంలో లక్ష్మాపూర్ నిర్వాసితులకు 384 మందికి ప్యాకేజీ అమలు చేశామని సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. నిర్వాసితులందరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాకేజీ అందుకున్న నిర్వాసితులు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేస్తున్నారని తెలిపారు.