ETV Bharat / state

తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టండి: హరీశ్​

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బీసీ బాలికల వసతి గృహం
author img

By

Published : Jul 31, 2019, 11:02 AM IST

విద్యార్థులు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో భోజనం, పరిసరాలను హరీశ్​రావు పరిశీలించారు. మెను ప్రకారం సమయానికి గుడ్లు, పండ్లు, చికెన్, పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి హరీశ్​, ప్రభాకర్ రెడ్డి భోజనం చేశారు. విద్యార్థులు అడిగిన వాటిన్నింటిని వెంటనే సమకూరుస్తానని హరీశ్ హామీ ఇచ్చారు.​

తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టండి: హరీశ్​

ఇవీ చూడండి : క్షేత్రస్థాయి కసరత్తులకై కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.