ETV Bharat / state

'నియంత్రిత పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం' - గజ్వేల్​ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్

మెదక్​ జిల్లా గజ్వేల్​ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​గా మాదాసు అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్​గా సుధాకర్​లతో మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఎంపీ ప్రభాకర్​రెడ్డి అధికారులు, కార్యకర్తలకు సూచించారు.

Madasu Annapurna as Chairperson of Medak District Gazwel Market Committee
ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి..
author img

By

Published : Jun 15, 2020, 10:18 PM IST

ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, రైతును రాజు చేయాలనే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పని చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి సూచించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​గా మాదాసు అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్​గా సుధాకర్​లతో మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపీ హాజరయ్యారు.

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ఉద్యమ సమయంలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రరేపించి కీలకపాత్ర పోషించిన కార్యకర్తకు పదవి దక్కడం సంతోషంగా ఉందని ఎంపీ ప్రభాకర్​రెడ్డి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్​, మంత్రి హరీశ్​, ఎంపీలకు అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు.

కష్టపడిన వారికే పదవులు..

నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఎంపీ ప్రభాకర్​రెడ్డి సూచించారు. రైతును రాజు చేయాలనే సీఎం ఆశయానికి అనుగుణంగా పని చేయాలని పేర్కొన్నారు. తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవులు తప్పకుండా వరిస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.