రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 గంటల తర్వాత అన్ని వ్యాపార కేంద్రాలు మూసేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు రద్దీగా ఉన్న నిత్యావసర దుకాణాలు అనంతరం నిర్మానుష్యంగా మారాయి. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఏఎస్పీ మహేందర్ ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పోలీసులకు తగిన సూచనలు ఇస్తున్నారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలని ఏఎస్పీ మహేందర్ ఆదేశించారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ జరిమానాలు విధిస్తున్నారు. ప్రధాన రహదారులు, వీధుల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కోలుకున్నా ఈ సమస్య వేధిస్తోందా?!