సిద్దిపేట జిల్లా చేర్యాలలో అఖిల పక్షం ఇచ్చిన బంద్ పిలుపు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. పట్టణ పరిధిలోని పెద్ద చెరువు అలుగు వద్ద స్థానిక ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలతో అఖిలపక్షం నేడు బంద్కు పిలుపునిచ్చింది.
ర్యాలీగా వెళ్లిన నాయకులు.. అలుగు వద్ద నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి వేశారు. దీన్ని పోలుసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం నిరసనకారులను పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: పోలవరం వద్ద మరో ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన