సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప్రభుత్వం తమకివ్వాల్సిన పరిహారం ఇవ్వలేదని ప్రాజెక్టు పనులు అడ్డుకుని నిరసన తెలిపారు. గుడాటిపల్లి గ్రామానికి చెందిన 150 మంది భూనిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ పరిహారం అందించిన తర్వాతే పనులు ప్రారంభించాలని బాధితులు డిమాండ్ చేశారు. వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హుస్నాబాద్ ఆర్డీవో అనంతరెడ్డి హామీ ఇచ్చినందున భూనిర్వాసితులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండిః భాగ్యనగరం నుంచే విశ్వవ్యాప్తంగా అమెజాన్ సేవలు