భూమి పంచాయతీ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు... అది కాస్తా కర్ర లు గొడ్డళ్లతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. వివారాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డి పల్లిలో తిప్పతీ నీలమ్మ, భర్త కొండయ్యలు నివసించేవారు. సంగుపల్లిలో భోగమల్ల కనకరాజు, తండ్రి ఎల్లయ్య ఉండేవారు. వారిరువురు లింగారెడ్డిపల్లిలోని భూమి పంపకం విషయంలో ఒకరికొకరు తగాదా పడ్డారు.
![land issues Attack with firewood and axes at lingareddypally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8127030_11.png)
ఒకరిపై ఒకరు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకోగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాయపోల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : కర్నల్ సంతోష్ భార్యకు డిప్యుటీ కలెక్టర్గా ఉత్తర్వులు