తెలంగాణలో గౌరవెల్లి భూనిర్వాసితుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. సోమవారం పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన హుస్నాబాద్ బంద్... తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు తమ గోడు పట్టడంలేదంటూ... ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాప్రతినిధులు, భూనిర్వాహితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలపై భూనిర్వాసితులు దాడికి దిగారు. కర్రలు, పైపులతో తెరాస నేతలు కూడా ఎదురుదాడి చేసుకున్నారు. ఘర్షణలో కొందరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు యత్నించిన హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్‌ఐ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. నిర్వాసితులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గుడాటిపల్లి నిర్వాసితులు పోలీసుస్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు
ఇదీ చదవండి :