కోరమీసాల కొమురవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణాలు చేస్తూ స్వామికి నైవేద్యాలు సమర్పించారు. భక్తి పారవశ్యంతో శరణు మల్లన్న అంటూ భక్తులు చేస్తున్న నామస్మరణలు ఆలయ పరిసరాల్లో మారుమోగుతున్నాయి. ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలతో పూనకాలు హోరెత్తుతున్నాయి.
ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై