ETV Bharat / state

'పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి' - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించడంలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు.

సిద్దిపేటలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి
author img

By

Published : Oct 25, 2019, 6:36 PM IST

సిద్దిపేటలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల విషయంలో అవకతవకలకు ఆస్కారం లేదని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మల్లన్న సాగర్​ ప్రాజెక్టు పూర్తయ్యాక... దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Intro:లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి.

Body:సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు 120, షాదీ ముబారక్ చెక్కులు 01, పట్టాదారు పాసు బుక్కులు 378 లబ్ధిదారులకు పంచారు, వీటి విలువ మొత్తం 1,20,89036, (కోటి ఇరవై లక్షల 89 వేల 36 రూపాయలు).

ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని, అధికారులు ఎవరైనా లంచం అడిగితే, వారిపైన చర్యలు తీసుకుంటామని, రాజకీయ నాయకులు అయితే జైలుకు పంపిస్తాము అని, పట్టాదార్ పాస్ బుక్ ల విషయంలో ప్రతి రైతుకు అవినీతి లంచానికి తావులేకుండా, అందించాలనేది ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని అన్నారు. పేదింటి ఆడబిడ్డల ను వారి పెళ్లిళ్లకు ఆదుకోవడం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. హుజూర్ నగర్ గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు.

Conclusion:మిరుదొడ్డి మండల కేంద్రంలో జరిగిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు.

మండల పరిధిలోని గ్రామాల లబ్ధిదారులకు చెక్కులను మరియు పాసుబుక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మండల జడ్పిటిసి లక్ష్మి, ఎంపీపీ గజ్జల సాయిలు, ఎంపీటీసీలు, గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.