కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి అదనపు హమాలీలను సమకూర్చుకోవాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్. బుధవారం హవేలీ ఘనపురం మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాల మేరకు ఉన్న ధాన్యానికే టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన