నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కంది మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండలంలో సమస్యలు పూర్తి చేయడానికి కావాల్సిన అంచనా వ్యయం, ప్రతిపాదనలు నవంబర్ 30 లోపు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసి... మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి నిధులు కోరనున్నట్లు తెలిపారు. 14 సంవత్సరాలుగా మాటలు లేని హరీశ్‌రావును కూడా అభివృద్ధి కోసమే కలిసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్‌కుమార్ కమిటీ చర్చలు