ETV Bharat / state

సంక్రాంతి వేళ - అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లన్న జాతర - Telangana Inavolu Mallanna Jatara

Inavolu Mallana Jatara 2023 : సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలలో జాతరలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర, హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు, సిద్ధిపేట జిల్లా బండ మల్లన్న జాతర, ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతరలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో వచ్చి భక్తులు జాతరలలో పాల్గొన్నారు.

Inavolu Mallanna Jatara 2023
Telangana Mallana Jatara 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 1:15 PM IST

Telangana Mallana Jatara 2023 సంక్రాంతి వేళ అంగరంగ వైభవంగా ఐనవోలు మల్లన్న జాతర

Inavolu Mallanna Jatara 2023 : జానపదుల జనజాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతరకు ,సంక్రాంతి సందర్భంగా దేవాలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారుతున్నాయి. మల్లికార్జునస్వామి జాతర సంక్రాంతి రోజు ప్రారంభమై ఉగాది వరకూ కొనసాగుతుంది. కండేల రాయుడు, మల్లన్న స్వామి, మల్లర దేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామి ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమీసాలతో భక్తులకు దర్శనమిస్తారు.

భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాల్లోనే విడిది చేస్తూ, నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ, స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఒగ్గు పూజారులు పటాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు పూనకాలు హోరెత్తుతున్నాయి. స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, ఇతర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

అట్టహాసంగా కొమ్మరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. అగ్నిగుండాలను దాటిన భక్తులు

ఏడాదికోసారి జరిగే మలన్న జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మార్నేని వంశస్థులు సంప్రదాయంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న రేణుక ఎల్లమ్మ పండుగ, మార్చి 8 మహా శివరాత్రి పర్వదినాన శివకల్యాణం వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం మహా పంప్రోక్షణ అనంతరం జాతర ముగుస్తుంది.

Telangana Mallana Jatara 2023 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో బాగంగా దేవాలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిరగడం ఆనవాయితీగా వస్తోంది. కొత్తకొండ అనే వ్యక్తి బ్రహ్మోత్సవాలకు ముందు 40 రోజులు ఉపవాసం చేసి గ్రామంలో కానుకలు సేకరించి వాటిని స్వామికి సమర్పించాడు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని బండ మల్లన్న జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు బోనాల బండ్లతో ఊరేగించారు.

హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని బాకారం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 12న మల్లన్న కళ్యాణంతో మొదలైన జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ జాతరకు నగర నలుమూలన నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జాతరలలో పాల్గోని తమ కోరికలు తీర్చాలని దేవుళ్లను వేడుకున్నారు. జాతరలో భాగంగా ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంక్రాంతి వేళ భక్త జనసంద్రంగా మారిన ఐనవోలు, కొత్తకొండ ఆలయాలు

ఐనవోలు మల్లన్న జాతర డ్రోన్ విజువల్స్​ మీరెప్పుడైనా చూశారా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.