ETV Bharat / state

దేశ రక్షణలో అమరులైన పోలీసుల సేవలను గుర్తించాలి: ఏసీపీ

దేశ రక్షణలో అమరులైన ప్రతి జవాన్, పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, గౌరవించాలని ఏసీపీ మహేందర్​ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాలో అమర జవాన్ నరసింహ నాయక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Identify the services of policemen who are immortal in national defense: ACP
దేశ రక్షణలో అమరులైన పోలీసుల సేవలను గుర్తించాలి: ఏసీపీ
author img

By

Published : Oct 23, 2020, 6:27 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాలో అమర జవాన్ నరసింహ నాయక్ విగ్రహానికి ఏసీపీ మహేందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు.

పోలీసులు చేస్తున్న త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులు, జవాన్​ల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ప్రతి సంవత్సరం వారి కుటుంబాలను పరామర్శిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాజుతండాలోని అమర జవాన్ నరసింహ నాయక్ కుటుంబాన్ని పరామర్శించినట్లు వివరించారు. దేశ రక్షణలో అమరులైన ప్రతి జవాన్, పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి, గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. దుబ్బాకలో భాజపాను గెలిపించండి : మాజీ మంత్రి బాబూమోహన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.