ETV Bharat / state

ప్లాస్టిక్ రహిత గ్రామం దిశలో ఇరుకోడు - HARISH PRYATANA

సిద్దిపేట జిల్లా ఇరుకోడు​ గ్రామం ఇప్పటికే స్వచ్ఛ గ్రామంగా వార్తల్లో నిలుస్తోంది. రెండు సార్లు  జాతీయ అవార్డులు గెల్చుకుంది. ప్రస్తుతం ప్లాస్టిక్ రహిత గ్రామానికి పునాది వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. గ్రామ ప్రజలకు చెత్తబుట్టలు పంపిణీ చేశారు.

ప్లాస్టిక్ రహిత గ్రామం దిశలో ఇరుకోడు
author img

By

Published : Sep 28, 2019, 4:42 PM IST

సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు స్వచ్ఛ గ్రామంగా రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డు పొందడంపై ఆర్థిక మంత్రి హరీశ్​ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఇరుకోడు గ్రామస్థులకు చెత్తబుట్టలను మంత్రి పంపిణీ చేశారు. ఇరుకోడు​లో గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్​ను నిషేధించాలని ప్రజలకు తెలియజేశారు. బతుకమ్మ పండగ తర్వాత అందరూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు.
మటన్, చికెన్ షాపు దగ్గరికి, కూరగాయల దుకాణానికి వెళ్లేప్పుడు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో పేదవారు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా గ్రామపంచాయతీయే దహన సంస్కారాల కోసం రూ.పది వేల ఇచ్చి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. అనంతరం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలలో భాగంగా పారిశుద్ధ్యంపై కొన్ని ఇళ్ళలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సన్మానం చేశారు.

ప్లాస్టిక్ రహిత గ్రామం దిశలో ఇరుకోడు

ఇవీ చూడండి:తెలంగాణ ఎత్తుతోంది పూలబోనం

Intro:TG_SRD_71_28_HARISH PRYATANA_SCRIPT_TS10058

యాంకర్: పాత చెత్తను బయటికి తీసేయండి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామానికి స్వచ్ఛ గ్రామం ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకున్నాo. ఈ గ్రామానికి రెండు సార్లు జాతీయ స్థాయి అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో చెత్తబుట్టలు పంపిణీ చేసిన హరీష్ రావు

Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..... ఇర్కోడ్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ను నిషేధం చేద్దాం ప్లాస్టిక్ రహిత తొలి గ్రామంగా ఇర్కోడ్ కావాలి. బతుకమ్మ పండగ తర్వాత అందరూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి.

Conclusion:మటన్ చికెన్ షాపు దగ్గరికి వెళ్లేటప్పుడు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలి. ఈ గ్రామంలో నేటి నుండి పేద వారు చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా గ్రామపంచాయతీ తరుపున ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాల కోసం గ్రామపంచాయతీ నుంచే పదివేల రూపాయలు ఇచ్చి ఉచిత దహన సంస్కారాలు నిర్వహిస్తుంది. అని హరీష్ అన్నారు. ముందు గ్రామంలో 30 రోజుల ప్రణాళికలలో భాగంగా పారిశుద్ధ్యంపై గ్రామంలో కొన్ని ఇళ్ళ లోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రజలను ఎలా చేసుకున్నారు. అని అడిగి తెలుసుకున్నారు ఊరు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చుట్టు ఎలాంటి మోరీలు గాని పాత వస్తువులు గాని పెట్టకూడదని హరీష్ రావు ప్రజలకు వివరించారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సన్మానం చేశారు.

బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.