భారతదేశశాస్త్ర – సాంకేతిక - అంతరిక్ష విజ్ఞానానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్ -2 ప్రయోగంలో సిద్దిపేట వాసి వీరబత్తిని సురేందర్ పాలు పంచుకున్నారు. ఆ విషయంపై స్పందించిన హరీశ్ రావు... ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. సిద్దిపేట ముద్దుబిడ్డ, అంతరిక్ష పరిశోధనా శాస్త్రవేత్త, ఆత్మీయ సోదరుడికి మనసారా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. భారతదేశానికే గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో సురేందర్ భాగస్వాములు కావడం సిద్దిపేట జిల్లావాసులందరికీ గర్వకారణమని హరీశ్ రావు తెలిపారు. భారతదేశ అంతరిక్ష ప్రయోగ రంగానికి, ప్రపంచానికి వీరబత్తిని సురేందర్ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
-
#Chandrayaan2 #Telangana pic.twitter.com/zjK2wgKEPf
— Harish Rao Thanneeru (@trsharish) July 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Chandrayaan2 #Telangana pic.twitter.com/zjK2wgKEPf
— Harish Rao Thanneeru (@trsharish) July 13, 2019#Chandrayaan2 #Telangana pic.twitter.com/zjK2wgKEPf
— Harish Rao Thanneeru (@trsharish) July 13, 2019
ఇవీ చూడండి: చంద్రయాన్-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం