మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పట్టణాన్ని సందర్శిస్తున్న క్రమంలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట అంటే స్వచ్ఛతకు, పరిశుభ్రతకు మారు పేరని అలాంటి సిద్దిపేట పట్టణం అపరిశుభ్రంగా ఉండడమేంటంటూ అధికారులపై మండిపడ్డారు. పట్టణంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం ఏంటంటూ ప్రశ్నించారు. సిద్దిపేటలో కిలోమీటరు మేర నడుస్తూ పట్టణంలో ఎక్కడా నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిపై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ