సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో హనుమాన్ శోభాయాత్రను స్వాములు ఘనంగా నిర్వహించారు. గ్రామం పురవీధుల గుండా హనుమాన్ ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు జరిపారు. హనుమాన్ స్వాములు కాషాయ జెండాలను చేతబట్టి అందరూ భక్తితో జై హనుమాన్, జై శ్రీ రామ్ అంటూ శోభాయాత్రను నిర్వహించారు. యాత్రను తిలకించే ప్రజలకు హనుమాన్ స్వాములు పులిహోర ప్రసాదాన్ని అందించారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు వాయిదా