పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు అందాలనే సంస్కరణలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు హృదయకపూర్వక అభినందనలు తెలియజేసిన ఆయన పాలనా సంస్కరణల్లో భాగంగా 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మంచి ఉద్దేశంతో పాలనా సంస్కరణలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగా. నేను పుట్టి పెరిగిన సిద్దిపేట జిల్లాలోనే తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించా. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచి ప్రారంభించాం. నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నాం. సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్గొండలో వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నాం.
-- ముఖ్యమంత్రి కేసీఆర్
సిద్దిపేటకు చాలా మంచి భవిష్యత్ ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. ఇది సెంట్రల్ తెలంగాణ అని ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి: CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం