సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ పంపు హౌస్ నుంచి మంగళవారం సాయంత్రం మొదటి పంపు ద్వారా గోదావరి జలాలను బయటకు వదిలారు. ఈ అప్రోచ్ కెనాల్ ద్వారా అక్కారం పంపు హౌస్‌కు అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి.
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నందున పట్టణ ప్రజలు గోదావరి జలాలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్, కాళేశ్వరం ఈఎన్సీ, మెగా కంపెనీ డైరెక్టర్, ఇంజినీర్ల బృందం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు