సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో గాంధీజీ 150వ జయంతి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అభిమానులు, తెరాస కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రంలో చాలా మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ దవాఖానలో కేకు కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లను పంచారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..