ETV Bharat / state

గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు

సిద్దిపేట జిల్లా గజ్వేల్​ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు వరించినట్లు సూపరింటెండెంట్​ మహేశ్​ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాను పురస్కారం వచ్చినట్లు తెలిపారు.

gajwel government hospital
గజ్వేల్​ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు
author img

By

Published : Sep 25, 2020, 11:53 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప అవార్డు వరించింది. 2019-20 సంవత్సరానికి గాను పురస్కారం లభించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్​ మహేశ్​ తెలిపారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ నుంచి సమాచారం అందిందన్నారు. ద్వితీయ స్థానంలో ప్రోత్సాహక బహుమతికి ఆస్పత్రికి ఎంపిక అయిందన్నారు.

ఆస్పత్రిలో పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, రికార్డులు నమోదు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బృందం.. గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసి.. కేంద్రానికి నివేదికను అందించింది.

ఇవీచూడండి: ఆరు నెలల తర్వాత హైదరాబాద్​లో ఆర్టీసీ సేవలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.