Four Brothers Dies in an Accident on Samruddhi Highway in Maharastra : ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అతివేగంతో నియంత్రణ కోల్పోయి క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యం సేవించి, వేగంగా వస్తున్న వాహనాలను గమనించకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేయడం, రాత్రిళ్లు ప్రయాణం చేస్తూ నిద్ర సరిపోక నియంత్రణ కోల్పోయి వాహనాలను ఢీకొట్టడమో లేదా డివైడర్లను తాకడమో చేసి ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగింది. తెలంగాణ నుంచి సూరత్‌కు వెళ్తున్న తెలంగాణ వాసులు నిద్రమత్తులో వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందారు.
అసలేం జరిగిందంటే: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన నలుగురు అన్నదమ్ములు సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన ఎరుకుల శ్రీనివాస్(38), కృష్ణ(39), సంజయ్(46), సురేష్(39)గా పోలీసులు గుర్తించారు. బతుకు దెరువుకోసమని కొన్నేళ్ల క్రితమే సూరత్‌కు వెళ్లారు. అక్కడ బట్టల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. అయితే తెలంగాణలో వీరి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో ఆకరి చూపు చూసుకుందామని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అంత్యక్రియల నిమిత్తం వీరు తెలంగాణకు వచ్చారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి సూరత్‌కు బయలుదేరారు. చివరి చూపు చూద్దామని వెళ్లిన అన్నదమ్ములను విధి వంచించి వీరిని కూడా తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
ప్రాణాలు తీసిన నిద్రమత్తు: నలుగురు అన్నదమ్ములు తన మేనమామ అంత్యక్రియల ఎర్టిగా కారులో అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత అన్నదమ్ములందరూ సూరత్‌కు బయలుదేరారు. కర్మద్-షేకతలోని సమృద్ధి హైవేపై వెళుతుండగా.. బుధవారం ఉదయం 3గంటల ప్రాంతంలో కారు నడుపుతున్న వ్యక్తికి నిద్రమత్తు ఆవహించింది. నిద్ర మత్తులో నియంత్రణ కోల్పోయిన వ్యక్తి వేగంగా కారు నడుపుతూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఒక్కసారిగి కారు పెద్ద శబ్దంతో ప్రమాదానికి గురయింది. ఈ ఘోరమైన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. కారు వెనుక కూర్చున్న బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో బయటపడ్డ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు. శబ్దాలను విని స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
ఇవీ చదవండి: