ETV Bharat / state

ప్రజలను నమ్మించి మోసం చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్​: జితేందర్​ రెడ్డి

author img

By

Published : Oct 5, 2020, 9:27 PM IST

రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆరేనని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదంతో ఉద్యమం చేస్తే చివరికు తెలంగాణకు కేసీఆర్​ మిగిల్చింది శూన్యమంటూ విమర్శించారు.

former mp jithender reddy criticised the trs government
కేసీఆర్​ ప్రజలను నమ్మించి మోసం చేశాడు: జితేందర్​ రెడ్డి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 15 వందల మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుని సాధించుకున్న తెలంగాణలో ఒక నియంత పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణ వస్తే తమకేదో ఒరగబెడుతుందనుకుంటే అందుకు భిన్నంగా జరుగుతుందంటూ తెరాస ప్రభుత్వం, కేటీఆర్​పై మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుని ప్రతీది ఆంధ్రావారికి అప్పజెప్పి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. నీళ్లన్ని ఆంధ్రాకు, నిధులన్ని కాంట్రాక్టర్లకు అప్పజెప్పి, నియామకాలు మాత్రం ఇంతవరకు చేయలేదని విమర్శించారు. అందుకే రానున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా జెండా ఎగరడం ఖాయమన్నారు. దుబ్బాక ఉపఎన్నికల నుంచే తెరాస పతనం ప్రారంభమైందని జితేందర్​రెడ్డి వ్యాఖ్యాానించారు.

ఇదీ చూడండి: 'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.