గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో భారీ ప్రమాదం సంభవించింది. లక్కీ లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తున్న గూడ శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవడం వల్ల మంటలు చెలరేగాయి. వంట చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి భార్య ఝాన్సీ, అక్కడే ఉన్న చిన్న కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో సామాగ్రి కాలిపోయి చిందర వందరగా పడిపోయాయి. వంట గదిలో ఉన్న అమ్మవారి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం సంఘటనా స్థలాన్ని చూడటానికి వచ్చిన వారిని ఆశ్చర్యపర్చింది.
ఇవీ చూడండి: ఏమైందో..ఏమో.. గోశాలలో 100 ఆవులు మృతి!