భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుటలో పర్యటించిన ఆయన... తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి, రైతు వేదిక భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం... ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రైతులు పాసుపుస్తకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని హరీశ్ అన్నారు.
ప్రతి మండలానికో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పెట్టి వారం లోపు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ సర్వే చేసి రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వచ్చే సంవత్సరం లోపు తొగుట మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి, రైతులకు అన్యాయం చేసే విధంగా... కేంద్రం కొత్త వ్యవసాయ చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. భాజపా నాయకులు ఏం చేశారని ఓట్ల కోసం వస్తున్నారని ప్రశ్నించారు. తెరాస అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: డిగ్రీ అర్హత పరీక్షకు టాలీవుడ్ ప్రముఖ నటి