సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామస్థులు కరోనా వైరస్ మహమ్మారి నుంచి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు రహదారులన్నింటిని కంచెతో దిగ్బంధనం చేశారు. గ్రామంలోకి బయటి వారు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.
అత్యవసర సమయాల్లో తప్ప ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని గ్రామ సర్పంచ్ దేవిరెడ్డి అన్నారు. గ్రామస్థులందరికీ కరోనా వైరస్ గురించి అవగాహన ఏర్పరచి అందరూ తమ ఇళ్లలోనే ఉండేలా చూడాలని పలువురికి సూచించారు.
ఇవీ చూడండి: లాక్డౌన్లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది