నియంత్రిత సాగు విధానానికి కట్టుబడి రైతుల తీర్మానం - farmers give conclusion for Regulated cultivation
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన రైతులు నియంత్రిత సాగు సేద్యానికి కట్టుబడి తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన పంటలు వేసేందుకు సిద్ధమని తెలిపారు.

నియంత్రిత సాగు విధానానికి కట్టుబడి రైతుల తీర్మానం
సీఎం కేసీఆర్ చెప్పిన పంటలు వేసేందుకు తాము సిద్ధమని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన రైతులు సర్పంచి కండ్లకోయ పర్షరాములు ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పిలుపుమేరకు, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచనలతో రైతులు నియంత్రిత సాగుకు, సేద్యానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.