ETV Bharat / state

విద్యుదాఘాతంతో రైతు మృతి.. బంధువుల ఆందోళన

బోర్​ మోటార్​ రిపేర్​ రాగా.. మరమ్మతు చేసేందుకు ట్రాన్స్​ఫాం లైన్ ఆపేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్​ షాక్​ తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండలం మునిగడప గ్రామంలో చోటుచేసుకుంది.​

farmer died with current shock in munigadapa
విద్యుదాఘాతంతో రైతు మృతి... బంధువుల ఆందోళన...
author img

By

Published : Jul 5, 2020, 11:00 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలం మునిగడపలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మరాఠీ బాలమల్లు అనే రైతు తన పొలంలో బోరు మోటారు రిపేరుకు రాగా.. లైన్​మెన్​కు ఫోన్ చేశాడు. మోటారుకు మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్​ఫాం వద్దకు వెళ్లి లైన్ ​ఆఫ్ చేసే క్రమంలో బాలమల్లుకు ప్రమాదవశాత్తు విద్యుత్​షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో బాలమల్లు అక్కడికక్కడే మృతిచెందాడు.

బాలమల్లుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్థులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. మృతుని కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించాలని డిమాండ్​ చేశారు. పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.