ETV Bharat / state

దుబ్బాకలో భాజపాను గెలిపించండి : మాజీ మంత్రి బాబూమోహన్​ - దుబ్బాకలో భాజపాను గెలిపించండి : మాజీ మంత్రి బాబూమోహన్​

ప్రజల సమస్యలు పరిష్కరించే భాజపాకే ఓటు వేయాలని.. మాజీ మంత్రి బాబూమోహన్​ దుబ్బాక ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్​ అభ్యర్థిని గెలిపించినా.. రెండు రోజుల తర్వాత తెరాస తీర్థం పుచ్చుకుంటారని.. తెరాస అభ్యర్థిని గెలిపిస్తే.. ప్రజల గురించి పట్టించుకోరని అందుకే భాజపాను గెలిపించి ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని ఆయన భాజపా తరపున దుబ్బాకలో ప్రచారం నిర్వహించారు.

Ex Minister Babu Mohan Participated in Election campaign in dubbaka
దుబ్బాకలో భాజపాను గెలిపించండి : మాజీ మంత్రి బాబూమోహన్​
author img

By

Published : Oct 23, 2020, 5:04 PM IST

సమర్ధుడు... సమస్యలు పరిష్కరించేవాడు భాజపా అభ్యర్థి రఘునందన్ రావునే గెలిపించాలని మాజీ మంత్రి బాబూమోహన్ కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పలు వీధుల్లో ఇంటింటికి తిరిగి భాజపా అభ్యర్థి రఘునందన్​ రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్​ పార్టీ ఢిల్లీలో లేదు.. తెలంగాణలో లేదు.. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా తెరాసలోకే వెళ్తాడు. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. తెరాస అభ్యర్థి కేవలం పేరుకు మాత్రమే. ప్రజా సమస్యల గురించి ఆమెకు అవగాహన లేదు. అందుకే.. భాజపాకు ఓటేసి గెలిపించాలని ప్రజలను బాబూమోహన్​ కోరారు. హరీష్ రావు నిధులను తీసుకెళ్లి సిద్దిపేట అభివృద్ధి చేస్తున్నాడని.. రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందాయని... దుబ్బాక అభివృద్ధి చెందలేదని ఆయన ఆరోపించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన వారి సమస్యలు పరిష్కరించాలంటే రఘునందన్​ రావునే గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.