సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఆరేపల్లిలో అరగంటకు పైగా ఈవీఎం మొరాయించింది. ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటర్లు పోలింగ్ బూత్‌లోనే నిరీక్షించారు. ఈవీఎంలో తేదీ తప్పుగా ఉండడం వల్ల 465 ఓట్లు పోలైన తర్వాత మిషన్ ఆగిపోయింది. సిబ్బంది సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
టెక్నీషియన్ సిబ్బంది వచ్చి సరి చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో వెంటనే ఏజెంట్ల సమక్షంలో మరో ఈవీఎంతో మాక్ పోలింగ్ నిర్వహించి, పోలింగ్ ప్రారంభించారు. పోలైన ఓట్ల ఈవీఎంను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేశారు.
ఈ సందర్భంలో కొంతమంది బూత్ లోపలికి వెళ్లారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తెరాస కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపించారు.
ఇదీ చూడండి: దుబ్బాకలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్