సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న తెరాస ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
తెరాస అభ్యర్థి సుజాతకు మద్దతుగా గజ్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఎంసీ రాజమౌళి... రాయపోల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి గెలిస్తే దుబ్బాక మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. భాజపా, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో తప్ప... మళ్లీ కనిపించరంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండిః బిహార్ బరి: తొలి దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్