శాసన, న్యాయవ్యవస్థలను కించపరిచేలా సిద్దిపేట కలెక్టర్ వ్యవహరిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయకుండానే... వరి వేయొద్దు, విత్తనాలు అమ్మొద్దని అనడం సరైన విధానం కాదని తెలిపారు. జిల్లా రైతులకు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేశారు.
ఏ అధికారైనా ఒకేచోట మూడేళ్లు మించి ఉండడని... కానీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఆరేళ్లుగా ఉంటున్నాని రఘునందన్‌రావు అన్నారు. కలెక్టర్ వ్యాఖ్యలపై కోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కలెక్టర్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంకట్రామిరెడ్డికి రాజకీయాలు ఇష్టమైతే వెంటనే రాజీనామా చేయాలన్నారు.
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి శాసన, న్యాయవ్యవస్థలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయకుండానే... వరి వేయొద్దు, విత్తనాలు అమ్మొద్దని అనడం సరైన విధానం కాదు. జిల్లా రైతులకు కలెక్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న కలెక్టర్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఫిర్యాదు చేశాం. వెంకట్రామిరెడ్డికి రాజకీయాలు ఇష్టమైతే వెంటనే రాజీనామా చేయాలి.- రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీ చదవండి: BJP Rythu Deeksha: వరి సాగుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష